
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.




