మహారాష్ట్రకు చెందిన సమీర్ జాదవ్ అనే వ్యక్తి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటించిన 'దృశ్యం' సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తన భార్య అంజలిని అక్టోబర్ 26న గొంతు నులిమి హత్య చేశాడు. భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించిన జాదవ్, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసి, అమాయకుడిగా ప్రవర్తించాడు. అతని అతి ప్రవర్తనతో పోలీసులకు అనుమానం వచ్చింది. సమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.