ఎంపీడీవో ఖాళీల భర్తీకి కలెక్టర్లకు ఆదేశాలు

23313చూసినవారు
ఎంపీడీవో ఖాళీల భర్తీకి కలెక్టర్లకు ఆదేశాలు
తెలంగాణంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) ఖాళీలను భర్తీ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌ జి.సృజన ఆదేశించారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టులను ఫుల్‌టైమ్‌ బేసిస్‌లో భర్తీ చేయాలని, రెగ్యులర్‌ ఎంపీడీవోలు వచ్చే వరకు సూపరింటెండెంట్లు, మండల పంచాయతీ అధికారులతో రీడిప్లాయ్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలకు గురువారం మెమో జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్