మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు?

41చూసినవారు
మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు?
TG:  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు రెండు కూరలు పెట్టాల్సి ఉండగా.. కేవలం ఒకటే పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వారానికి మూడు సార్లు కోడిగుడ్డు పెట్టాల్సి ఉండగా.. కేవలం ఒకసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అయితే మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తుందని, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు పెడితే తాము నష్టపోతామని వంట కార్మికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్