జాతీయ జెండాకు అవమానం (వీడియో)

11160చూసినవారు
AP: విశాఖపట్నంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఘటన కలకలం రేపింది. శనివారం పాఠశాల హెచ్‌ఎం ఎం. వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడంపై స్థానికులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్