
గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి
AP: పశ్చిమ గోదావరి (D) జంగారెడ్డిగూడెం (M) మార్కండేయ పురంలో ర్యాలీ జెస్సి దివానా (2) అనే రెండేళ్ల చిన్నారి గొంతులో అన్నం ముద్ద అడ్డుపడటంతో ఊపిరాడక మృతి చెందింది. తండ్రి ఆంజనేయులు కుమార్ చిన్నారికి అన్నం తినిపిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




