వివాహ వేడుకలో రిటర్న్‌ గిఫ్ట్‌గా గ్రామస్తులందరికీ బీమా

46చూసినవారు
వివాహ వేడుకలో రిటర్న్‌ గిఫ్ట్‌గా గ్రామస్తులందరికీ బీమా
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బహదూర్‌పూర గ్రామానికి చెందిన సిద్ధేశ్వర్, మంజూష వారి పెళ్లి సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారి పెళ్లికి వచ్చిన 3500 మంది గ్రామస్తులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష విలువైన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలను రిటర్న్ గిఫ్ట్‌గా అందించింది. ఆడంబరాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించాలనే తమ నిబద్ధతను ఈ కుటుంబం చాటుకుంది. అనుకోని ప్రమాదాల సమయంలో ఈ బీమా ఎంతో ఉపయోగపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్