బంగారానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి.. ఎందుకంటే?

5513చూసినవారు
బంగారానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి.. ఎందుకంటే?
భారతదేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో జ్యువెలరీ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత పెరిగింది. దీంతో దొంగతనం లేదా నష్టం జరిగితే భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అయితే చాలామంది బంగారం కొనుగోలు చేస్తూనే సరైన ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదు. నిపుణుల ప్రకారం, జ్యువెలరీ ఇన్సూరెన్స్ దొంగతనం, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ట్రాన్సిట్ సమయంలో నష్టాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా జ్యువెలర్లకు ‘జ్యువెలర్స్ బ్లాక్ పాలసీ’ సమగ్ర రక్షణ అందిస్తుంది. పెరిగిన ధరల నేపథ్యంలో బంగారాన్ని కేవలం ఆస్తిగా కాకుండా రక్షించే పెట్టుబడిగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్