ఏప్రిల్​ 2 నుంచి 'ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్': పొంగులేటి

4చూసినవారు
ఏప్రిల్​ 2 నుంచి 'ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్': పొంగులేటి
TG: రాష్ట్రంలో ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. తొలుత నారాయణపేట జిల్లా కోస్గి, RR జిల్లా అమన్‌గల్, SRD జిల్లా వట్‌పల్లి, KMM జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన పోర్టల్ అని తెలిపారు. ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయించనున్నట్లు వివరించారు. కాగా పైలట్ దశ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్