
చిత్తూరు జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
AP: రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లి వద్ద టాటా ఏస్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బాలు, సందీప్, జీతేంద్ర మృతి చెందారు. మరో ఘటనలో, నగరి మండలం మండపం వద్ద లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మదన్ కుమార్, అజిత్ కుమార్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




