TG: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి(D) రామగుండం(M) మల్యాలపల్లిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. NLG జిల్లా మునుగోడు మండలంలో 45.8, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.4, ADB జిల్లా బేలలో 45.3, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 45.3, KRNR జిల్లా చొప్పదండిలో 45.2 డిగ్రీలుగా నమోదయింది. రానున్న 3 రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మే 6 వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.