దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. సోమవారం, ఏప్రిల్ 27న, దేశవ్యాప్తంగా గరిష్టంగా 255.85 గిగావాట్ల విద్యుత్తును వినియోగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వాడకం పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. ఈ నెలలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది జూన్‌లో 242.77 గిగావాట్లు, 2024 మేలో 250 గిగావాట్లు, 2023 సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ ఏడాది గరిష్టంగా 270 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.