ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ చార్జ్

91చూసినవారు
ధర్మారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ చార్జ్
TG: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు  వేళ నిజామాబాద్(D) డిచ్‌పల్లి (M) ధర్మారం గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల మద్దతుదారులు పోలింగ్ కేంద్రం లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్