TG: కులాంతర వివాహాలు చేసుకున్నవారికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఈ పథకం కింద రూ.2. 50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోంది. అయితే జంటల్లో వధువు లేదా వరుడు ఇద్దరిలో ఒకరు ఎస్సీ అయి ఉండాలి. వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఈ పథకం కోసం అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి