ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఖండించింది. ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, గతంలో ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో
ఫలితాలు విడుదల కాలేదని తెలిపింది. జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాలను బట్టి ఫలితాల విడుదల తేదీలు ఏటా మారుతుంటాయని, ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.