హైదరాబాద్‌లోని బాచుపల్లిలో శ్రీ చైతన్య కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిత (16) హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వర్షిత మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. దీంతో వారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.