AP: విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ రెండో సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన ఆమె బీటెక్లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాచవరం ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.