AP: నంద్యాల జిల్లా కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో రసాయనాలు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థినుల మధ్య జరిగిన వివాదం కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.