ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

31చూసినవారు
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
TG: పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే ఆందోళనతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్(D) చేగుంట(M)లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహింపూర్ గ్రామానికి చెందిన బిటి నర్సింలు కుమార్తె బిటి మహాలక్ష్మి (17) ఇంటర్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసింది. అయితే ఆ పరీక్షల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని ఆందోళన చెంది సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్