అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి

24చూసినవారు
అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
TG: ఓ ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కరీంనగర్(D) సైదాపూర్(M) శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. రెడ్డి లావణ్య, రాజు దంపతుల రెండవ కుమార్తె రెడ్డి అర్చన(17) సోమారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం కాలేజీకి వెళ్లి పరీక్ష రాసి వచ్చి రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపింది. అయితే తెల్లవారేసరికి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్