TG: మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. వీలైతే ఈ మొత్తాన్ని రూ.లక్షన్నర కోట్లకు పెంచుతాని ప్రకటించారు. మంగళవారం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రూ.57 వేల కోట్లను అందజేశామని, వాటిపై ప్రభుత్వం వడ్డీ భరిస్తూ రూ.1329 కోట్లను చెల్లించిందని తెలిపారు. ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.