
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయానికి, సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 82,990 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 25,525 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టీఎంపీవీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ స్టాక్స్ నష్టాల్లో కదులుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.25గా ఉంది.




