
గోల్కీపర్ను ఢీకొని.. మైదానంలో కుప్పకూలి ఫుట్‌బాలర్ మృతి (VIDEO)
స్పెయిన్‌లోని ఎస్టాడియో మైదానంలో సోమవారం సీడీ టెనెరిఫ్, ఎఫ్‌సీ ఆండోరా క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంతిని ఛేజ్ చేస్తున్నప్పుడు టెనెరిఫ్ ఆటగాడు జీసస్ డి మిగెల్ (30) గోల్‌కీపర్ జీసస్ ఓనోను బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో మిగెల్ ఛాతీకి తీవ్ర గాయమై కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని టెనెరిఫ్ క్లబ్ అధికారికంగా ధృవీకరిస్తూ సంతాపం ప్రకటించింది.




