హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్

0చూసినవారు
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్
ఏకాగ్రా చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో అంతర్జాతీయ ఓపెన్‌ రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్స్‌ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ వైస్‌ చైర్మన్‌, నంది అవార్డు గ్రహీత షరీఫ్‌ మహ్మద్‌ తెలిపారు. 2022లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 1,300 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఈ ఏడాది 2వేలకు పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. రాయ్‌ చౌదరి సప్తర్షి (భారత్‌), ట్విల్‌ కోపు సెరీజ్‌ (నెథర్లాండ్స్‌), సాప్‌చెంకో బోరిస్‌ (రష్యా), పెట్రోస్‌ మారియన్‌ (బల్గేరియా) వంటి గ్రాండ్‌ మాస్టర్లు పోటీ పడనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్