అంతర్జాతీయ స్విమ్మర్‌ క్వీనీ విక్టోరియా మరో రికార్డు

6124చూసినవారు
అంతర్జాతీయ స్విమ్మర్‌ క్వీనీ విక్టోరియా మరో రికార్డు
హైదరాబాద్‌లోని బర్కత్‌పురానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్‌ గంధం క్వీనీ విక్టోరియా, ఐదుగురు మహిళల బృందంతో కలిసి శ్రీలంకలోని తలైమీనార్‌ నుంచి తమిళనాడులోని రామేశ్వరం ధనుష్కోడి వరకు 59 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల 10 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించారు. ఈత ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమై మధ్యాహ్నం 12.10 గంటలకు ముగిసింది. ఈ బృందంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ, మౌనిక (తెలంగాణ), స్మిత (మహారాష్ట్ర), ధాత్రిక మండవ (విజయవాడ) ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఓడబ్లూస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు సతీశ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్