
టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతల కత్తులతో దాడి: ఎమ్మెల్యే శిరీషాదేవి ఆగ్రహం
ఉమ్మడి తూర్పు గోదావరి ఏజెన్సీలో టీడీపీ కార్యకర్త వేణుగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా, వైసీపీ నేత వెంకటేశ్వరరావు, మరో నలుగురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వేణుగోపాల్ రెడ్డి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వేణుగోపాల్ రెడ్డిని ఆస్పత్రిలో ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. ఏజెన్సీలో అనంతబాబు ఆగడాలు ఎక్కువయ్యాయని, టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు.




