డిగ్రీలో ఇక మీదట ఇంటర్న్‌షిప్‌..వచ్చే ఏడాది నుంచే అమలు

20చూసినవారు
డిగ్రీలో ఇక మీదట ఇంటర్న్‌షిప్‌..వచ్చే ఏడాది నుంచే అమలు
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్‌లో ఈ ఇంటర్న్‌షిప్ లేదా అప్రెంటిస్‌షిప్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలు పెరిగి, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్