మద్యం మత్తులో కల్లుగీసే కత్తితో భార్యపై దాడి

148చూసినవారు
మద్యం మత్తులో కల్లుగీసే కత్తితో భార్యపై దాడి
AP: బాపట్ల జిల్లాలొ దారుణ ఘటన చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం చింతాయపాలెంలో మద్యం మత్తులో ఉన్న భర్త రమేశ్, తన భార్య నాగమణిపై కల్లుగీసే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, మరోసారి గొడవ జరిగినప్పుడు రమేశ్ ఆవేశంతో ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్