చైనా బలగాల చొరబాటు.. భారత్ హెచ్చరిక

541చూసినవారు
చైనా బలగాల చొరబాటు.. భారత్ హెచ్చరిక
అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చైనా దళాలు అక్రమంగా చొరబడ్డాయనే నివేదికలపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల్లో నెలకొనే పరిస్థితులే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆగస్టు 6న జరిగిన భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం (WMCC) 36వ సమావేశంలోనూ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతలను కాపాడటం అత్యంత కీలకమని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయరాని భాగమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్