
ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యంతో బాలింత మృతి!
TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంభీరావుపేట(M) లింగన్నపేట గ్రామానికి చెందిన తమ్మనవేణి భానుచందర్ భార్య సౌజన్య (23) డిసెంబర్ 24న సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పాపలకు జన్మనిచ్చారు. అయితే సౌజన్యకు రక్తం తక్కువగా ఉందని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. వెంటనే ఓ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. పది రోజుల ట్రీట్మెంట్ తర్వాత శనివారం సౌజన్య చనిపోయింది. అయితే సౌజన్య మృతికి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.




