
తల్లి, కొడుకుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు సాంబశివరావు(36)ను నరికి చంపారు. ఈ దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారి(55)కి తీవ్ర గాయాలయ్యాయి, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు పారిపోతుండగా గ్రామస్థులు చాగల్లు వద్ద పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.




