టెక్ దిగ్గజం యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక డిమాండ్, సరఫరా సమస్యల నేపథ్యంలో దేశీయంగా ఐఫోన్ 17 ధరను సవరించాలని కంపెనీ భావిస్తున్నది. ఐఫోన్ 16తో పోలిస్తే సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 17 ధర రూ. 3,000 ఎక్కువ ధరకు విడుదలైంది. అయితే, ఇటీవల అధిక డిమాండ్ దృష్ట్యా ఇది ఇంకాస్త పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే సవరణ తర్వాత ఐఫోన్-17 256జీబీ ధర రూ. 89,900కి, 512జీబీ ధర రూ. 1,09,900కి చేరుకుంటుంది.