
'ఆపరేషన్ సిందూర్' మళ్లీ మొదలు కానుందా?
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు దాడి ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో 'ఆపరేషన్ సిందూర్' మళ్లీ మొదలైనట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఘటనకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పుల్వామా నివాసి ఉమర్ మొహమ్మద్ పేలుడు వెనుక ఉన్నట్లు సీసీటీవీల్లో కనిపించింది. ఉమర్ టెలిగ్రామ్ ద్వారా పాకిస్తాన్ జైషే మహ్మద్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.




