
జూబ్లీహిల్స్లో 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నాన్ లోకల్స్పై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, మాక్ పోలింగ్లో ఈవీఎంలు మొరాయించడంతో 9 చోట్ల వాటిని మార్చామని తెలిపారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వెల్లడించారు.




