దీపావళి గిఫ్ట్‌గా ఐఫోన్లు.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ (VIDEO)

24చూసినవారు
దీపావళి సందర్భంగా ఢిల్లీలోని ‘ఫైనాన్సర్‌సాబ్‌’ సంస్థ ఉద్యోగులకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. రోహిణి ప్రాంతంలోని ఈ కంపెనీ ఉద్యోగుల డెస్క్‌లపై ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్లను ఉంచి సర్‌ప్రైజ్‌ చేసింది. ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులు తమ డెస్క్‌లపై ఫోన్లు చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియోను సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. సాధారణంగా స్వీట్లు, గిఫ్ట్‌ హ్యాంపర్లు ఇచ్చే కంపెనీలకు భిన్నంగా ఐఫోన్లు ఇవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయా?’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్