
మొంథా తుఫాన్ తర్వాత జోరుగా బంగారం వేట
ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలు బంగారం కోసం వేట మొదలుపెట్టారు. తుఫాన్ వెళ్లిపోగానే సముద్ర కెరటాల నుంచి బంగారం తీరానికి కొట్టుకొస్తుందనే నమ్మకంతో ప్రజలు పోటీ పడుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పురాతన వెండి నాణేలు లభ్యం అయ్యాయి. ప్రస్తుతం బంగారం దొరుకుతుందో లేదో తెలియదు కానీ వేట మాత్రం జోరుగా సాగుతోంది.




