
ఆరు నెలల లోపు పిల్లల్లో కొత్త డయాబెటిస్ రకం
ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పసిపిల్లల్లో సరికొత్త రకం డయాబెటిస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చాలా అరుదైన జన్యు సమస్య వల్ల వస్తుందని TMEM167A అనే జన్యువు లోపం దీనికి కారణమని పరిశోధనలో తేలింది. ఈ జన్యువు లోపం వల్ల ప్యాంక్రియాస్‌లోని కణాలు ఇన్సులిన్ ను సరిగా తయారు చేయలేక చనిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు పిల్లల్లో ఈ పరిస్థితిని గుర్తించారు.




