IPL-2026: ఢిల్లీపై CSK ఘన విజయం

76చూసినవారు
IPL-2026: ఢిల్లీపై CSK ఘన విజయం
IPL-2026లో భాగంగా చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచులో ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 212/2 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆల్ఔట్ అయింది. దీంతో చెన్నై గెలుపును ఖాతాలో వేసుకుంది. DC బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక(41), స్టబ్స్(60) మాత్రమే రాణించారు. CSK బౌలర్ జామీ ఓవర్టన్ 3, అన్షుల్ 3, ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్