
తాజ్ మహల్ సందర్శించిన టిఫనీ ట్రంప్ (వీడియో)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్, తన భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న ఆమె, శనివారం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను తిలకించి, అక్కడి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆమె జైసల్మేర్‌కు బయలుదేరి వెళ్లారు. టిఫనీ ట్రంప్ తన భారత పర్యటనను 'అద్భుతంగా, చిరస్మరణీయంగా' అభివర్ణించారు. ఇది ఆమె రెండో భారత పర్యటన.




