
తమ్ముడిని కాపాడేందుకు.. అన్న సాహసం (వీడియో
ఆపదలో ఉన్న తమ్ముడిని ఓ అన్న సాహసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైకిల్ తొక్కుతూ ఓ బాలుడు అదుపుతప్పి చెట్లలోకి జారి పడిపోయాడు. అది గమనించిన అన్నయ్య ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి అతడిని కాపాడేందుకు ముందుకు దూకాడు. 'అన్నకు తమ్ముడు బలం, తమ్ముడికి అన్న ధైర్యం' అనే మాటలను నిజం చేస్తూ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.




