
BIG ALERT: ఏపీకి తుఫాన్ ముప్పు.. మళ్లీ వర్షాలు!
AP: మొంథా తుఫాన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మరో ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19/20వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది తుఫాన్‌గా బలపడి ఈనెల 25 నాటికి తీరం దాటొచ్చని అంచనా వేశారు. కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.




