
రెస్టరెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి (వీడియో)
దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఒక రెస్టరెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది లోపల చిక్కుకొని ఉండే అవకాశం ఉందని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.




