ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో 'ఫైనల్ లీప్' పేరుతో ఇన్నింగ్స్ బ్రేక్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కాన్సర్ట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో, GT ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత లేజర్ షో, విజువల్ ఎఫెక్ట్స్, సంగీత ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ఆలపించిన శివ తాండవ స్తోత్రం, చివర్లో జరిగిన బాణసంచా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.