IPL ‘ఫైనల్’.. బెంగళూరులో కఠిన ఆంక్షలు

64చూసినవారు
IPL ‘ఫైనల్’.. బెంగళూరులో కఠిన ఆంక్షలు
ఐపీఎల్ 2026 ఫైనల్‌లో RCB, GT జట్లు అహ్మదాబాద్‌లో తలపడనున్న నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నగర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడం లాంటివి నిషేధించారు. మ్యాచ్ అనంతరం బైక్ స్టంట్లు, హారన్లతో హంగామా, టపాసులు కాల్చడం, ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించడం, బహిరంగంగా మద్యం సేవించడం వంటివి చేయకూడదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్