IPL FINAL... బెంగళూరులో కఠిన ఆంక్షలు

25చూసినవారు
IPL FINAL... బెంగళూరులో కఠిన ఆంక్షలు
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటు నిషేధించారు. అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటివి చేయరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అభిమానులు తమ ఇళ్ల వద్దే మ్యాచ్ చూసి సహకరించాలని కోరారు.