ఇరాన్ గగనతలం మూసివేత.. స్తంభించిన విమానయాన రంగం

0చూసినవారు
ఇరాన్ గగనతలం మూసివేత.. స్తంభించిన విమానయాన రంగం
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌లో అంతర్గత నిరసనల నేపథ్యంలో, ఇరాన్ ప్రభుత్వం తన గగనతలాన్ని హఠాత్తుగా మూసివేసింది. దీనితో భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి. కొన్నింటిని దారి మళ్లించాయి. భద్రతా కారణాల దృష్ట్యా, పౌర విమానాలు క్షిపణి దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రభుత్వం ఇరాన్‌లో ఉన్న భారతీయులను వెంటనే దేశం విడిచి రావాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్