పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే కువైట్, బహ్రెయిన్‌లోని
అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ తెలిపారు. నిన్న ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై ఆమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీకారంగా తాము దాడులు చేస్తున్నట్లు IRGC పేర్కొంది.