పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్, ఖతర్‌లోని అమెరికా స్తావరాలపై ఇరాన్ దాడులకు దిగింది. దుబాయ్‌లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్‌ను తాకింది. ఈ దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.