గంటల వ్యవధిలోనే ఇరాన్ మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేసినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా హామీలను విస్మరించి నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోందని ఆరోపించింది. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం ఆగేంతవరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా చర్యల నేపథ్యంలో హర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది.