మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా భూతల దాడి చేసే అవకాశం ఉందని భావిస్తూ ఇరాన్ 10 లక్షలకు పైగా యోధులను సిద్ధం చేసింది. ఇరాన్ యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. అమెరికా దళాలు ఇరాన్ భూభాగంలోకి వస్తే చరిత్రలో గుర్తుండిపోయే ప్రతిఘటన ఎదురవుతుందని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైనిక కదలికలు పెంచుతున్నప్పటికీ, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతోంది.